News August 31, 2024
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

భారీ వర్షాల దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాల ముఖ్య అధికారులతో జరిపిన సమీక్షలో కలెక్టర్లతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. తుఫాన్ తీరం దాటేటప్పుడు 55- 65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని సీఎం ఈ మేరకు సమీక్షలో స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
టెక్కలిలో యువకుడిపై పొక్సో కేసు నమోదు

టెక్కలికి చెందిన ఓ యువకుడిపై శుక్రవారం పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. టెక్కలి సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. తన ఇంటి సమీపంలోని మైనర్ బాలికను కొంతకాలంగా యువకుడు వేధిస్తున్నాడు. ఇటీవల తల్లితండ్రులు ఇంట్లో లేనప్పుడు బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
News November 1, 2025
మీ మూలధనం, మీ హక్కు వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఇన్ఛార్జి కలెక్టర్

భారత ప్రభుత్వం ఆర్థిక సేవలు విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి మీ మూలధనం, మీ హక్కుఅనే ప్రత్యేక ప్రచార వాల్ పోస్టర్ను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో DRO వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, లీడ్ బ్యాంకుల మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News October 31, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

★ పల్లెల అభివృద్దే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే కూన
★సారవకోట: దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్
★ పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు అశోక్, శంకర్
★ కోటబొమ్మాళిలో చెట్టుకు ఉరివేసుకుని ఒకరు సూసైడ్
★ లావేరులో అగ్నిప్రమాదం..మూడు పూరిళ్లు దగ్ధం
★ పాతపట్నం: రాళ్లు తేలిన ఆల్ ఆంధ్రా రోడ్డు
★ జిల్లాలో పలుచోట్ల పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీలు


