News March 26, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పాల్గొన్నారు. విజయవాడలోని రాష్ట్ర సచివాలయంలో మొదటి రోజైన మంగళవారం సమావేశం జరిగింది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది.
Similar News
News October 25, 2025
బేకరీపై టాస్క్ఫోర్స్ దాడులు

వరంగల్ ఫోర్టు రోడ్డులోని ఓ బేకరీ షాపుపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. గడువు తీరిన, నాణ్యత లేని రూ.11 వేల విలువైన తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం షాపు యజమానిని మున్సిపల్ ఆరోగ్య విభాగానికి అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
News October 25, 2025
భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమం కింద రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, భూభారతి దరఖాస్తులపై సమీక్ష జరిపారు. పెండింగ్లో ఉన్న ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని సూచించారు.
News October 25, 2025
వనపర్తి: ప్రజావాణి ప్లేస్ తాత్కాలికంగా మార్పు

వనపర్తి జిల్లాలో ఈనెల 27న నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం వచ్చే సోమవారం సాధారణంగా జరిగే కలెక్టరేట్ మీటింగ్ హాల్ (IDOC) లో కాకుండా, RDO కార్యాలయం సమావేశ మందిరం (రూమ్ 3) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 27న ఎక్సైజ్ శాఖ లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం ఉండటంతో ప్రజావాణి ప్రదేశం తాత్కాలికంగా మార్పు చేశామన్నారు.


