News April 15, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్

HYDలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ హోదాలో కలెక్టర్ డా. పి.శ్రీజ పాల్గొన్నారు. భూ భారతి పోర్టల్, ఇందిరమ్మ ఇండ్లు, వేసవిలో తాగు నీటి ప్రణాళికలపై సీఎం చర్చించినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ తెలిపారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను ఆయా మండలాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని సీఎం చెప్పారన్నారు.
Similar News
News November 13, 2025
ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.
News November 13, 2025
ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్‌లు ఉన్నాయి.
News November 13, 2025
ఖమ్మం జిల్లాలో 52,260 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 326 కొనుగోలు కేంద్రాల ద్వారా 52,260 క్వింటాళ్ల నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. తల్లాడ, కల్లూరు మండలాల్లో 101 మంది రైతుల నుంచి సేకరించిన 5,134 క్వింటాళ్ల సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌గా రూ.25.67 లక్షలు 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు.


