News April 15, 2025

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్

image

HYDలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ హోదాలో కలెక్టర్ డా. పి.శ్రీజ పాల్గొన్నారు. భూ భార‌తి పోర్టల్, ఇందిర‌మ్మ ఇండ్లు, వేస‌విలో తాగు నీటి ప్ర‌ణాళిక‌లపై సీఎం చర్చించినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ తెలిపారు. భూ భార‌తి పైలెట్ ప్రాజెక్టు స‌ద‌స్సుల‌ను ఆయా మండ‌లాల్లో ప్ర‌తి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం చెప్పారన్నారు.

Similar News

News April 25, 2025

ఖమ్మం: వరకట్నం కోసం ఒప్పంద పత్రం డిమాండ్.. ఆగిన పెళ్లి

image

వరకట్నం ఇచ్చే విషయమై ఒప్పంద పత్రం రాస్తేనే పెళ్లి జరుగుతుందని వరుడు తెగేసి చెప్పడంతో పీటలపైన పెళ్లి ఆగిపోయిన ఘటన కూసుమంచిలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీయువకుడు ఇష్టపడ్డారు. ఇరువర్గాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వరుడు నగదు, ఎకరా భూమి ఎప్పుడు ఇస్తారో ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పెళ్లి నిలిచిపోయింది.

News April 25, 2025

పెనుబల్లి: వడదెబ్బకు గురై మరో వ్యక్తి మృతి

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం వ్యవధిలో ఆరుగురు మృతిచెందగా.. ఇవాళ ఒకరు చనిపోయారు. పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంకు చెందిన వడ్రంగి నెల్లూరి బోధనాచారి అలియాస్ చంటి (37) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News April 25, 2025

కారేపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు(52) రెండు ఎకరాలలో మిర్చి, రెండు ఎకరాలలో పత్తి సాగు చేశాడు. పంట సరిగ్గా పండగ పోవడంతో చేసిన అప్పులు తీరవని బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

error: Content is protected !!