News March 26, 2025
కలెక్టర్ల సదస్సు హాజరైన నంద్యాల కలెక్టర్

అమరావతిలో గల వెలగపూడిలో ఉన్న సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్ర కలెక్టర్ల సదస్సుకు మంగళవారం నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా హాజరయ్యారు. ఈ సదస్సుకు 26 జిల్లాల నుంచి కలెక్టర్లు హాజరుకాగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సదస్సులో కలెక్టర్లతో పాటు పలు శాఖల మంత్రులు ముఖ్య అధికారులు ఉన్నారు.
Similar News
News April 20, 2025
చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన KCR

ఏపీ సీఎం చంద్రబాబుకు KCR జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు BRS ట్వీట్ చేసింది. ‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని KCR ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కేసీఆర్ కోరుకున్నారు’ అని పేర్కొంది. అటు విజయసాయిరెడ్డి కూడా CBNకు విషెస్ చెప్పారు.
News April 20, 2025
భార్య/భర్తల్లో ఈ లక్షణాలు ఉంటే..

ఈ లక్షణాలుంటే మీ పార్ట్‌నర్‌కు మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టేనని, జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఏ విషయాన్నీ డిస్కస్ చేయకపోవడం
*పాజిటివ్ విషయాలకూ చిరాకు పడటం
*ఫ్యూచర్ గురించి పట్టించుకోకపోవడం
*ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకపోవడం
*మీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడుకోవడం
*కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా దగ్గరకి రాకపోవడం
News April 20, 2025
ఎన్టీఆర్: LLM పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLM(మాస్టర్ ఆఫ్ లాస్) 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.