News March 8, 2025
కలెక్టర్, ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి కోమటిరెడ్డి సన్మానం

శనివారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఎమ్మెల్యే నల్లమాద పద్మావతిలను మంత్రి కోమటిరెడి స్వయంగా సన్మానించి మహిళా దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 5, 2025
NLG: 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలంలో ఇప్పటి వరకు 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, అందులో 46,568 మెట్రిక్ టన్నుల ధాన్యం ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసి.. 5,657 మంది రైతులకు రూ.102 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
News November 4, 2025
NLG: పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

వివిధ ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోత పథకాల కింద భూసేకరణ, పునరావస పనులపై సమీక్ష నిర్వహించారు.
News November 4, 2025
నల్గొండ: ‘గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించాలి’

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తున్న సందర్భంగా గృహజ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని నూతన లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డ్ లేకపోవడం వల్లే గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అధికారులు స్వీకరించలేదని వారు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు 60 వేల మంది నూతన కార్డుదారులు ఉన్నారు.


