News September 29, 2024
కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంత్ రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ధరణి, ప్రజావాణి దరఖాస్తులు, వాల్డా చట్టంపై సమీక్షించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ విషయంలో పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, భువనగిరి ఆర్డీఓ అమరేందేర్, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News October 5, 2024
NLG: బీఈడీ ఫలితాలు విడుదల
MG యూనివర్సిటీ పరిధిలో బీఈడీ సెమిస్టర్ ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ లక్ష్మీప్రభ శుక్రవారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 92.6 శాతం, మూడో సెమిస్టర్లో 79.30 శాతం, రెండో సెమిస్టర్లో 84.96 శాతం, మొదటి సెమిస్టర్లో 77.7 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
News October 5, 2024
యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త
మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 5, 2024
నేటి నుంచి నల్గొండలో చేనేత హస్తకళా మేళా
నల్గొండ బోయవాడలో గల ఎస్బీఆర్ గార్డెన్స్‌లో ఈ నెల 5 నుంచి 27 వరకు కళాభారతి చేనేత హస్తకళ మేళా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జెల్లా సత్యనారాయణ తెలిపారు. ఇందులో అఖిలభారత హస్తకళ, చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలంతా ఈ ప్రదర్శనను తిలకించి చేనేతను ఆదరించాలని కోరారు. చేనేత కళాకారులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్త్రాలను అమ్మడం జరుగుతుందని తెలిపారు.