News March 22, 2025

కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపు ‘మాక్ డ్రిల్’

image

బాంబు బెదిరింపు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, అనే విషయంపై శుక్రవారం రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు, ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయంలో అణువణువు తనిఖీ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. మాక్ డ్రిల్ ఉద్దేశం ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వడమేనని అన్నారు.

Similar News

News December 13, 2025

నిషేధాజ్ఞల ఉల్లంఘన.. వెదురుగట్ట సర్పంచ్‌పై కేసు

image

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన పెంచల శ్రీనివాస్‌పై ఎన్నికల నిబంధనలు (MCC) ఉల్లంఘన కింద కేసు నమోదైంది. డిసెంబరు 11న రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ సుమారు 100 మందితో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జ్, డిప్యూటీ తహశీసిల్దార్ ఫిర్యాదు మేరకు చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 13, 2025

KNR: పంచాయతీ పోరుకు పటిష్ట భద్రత: సీపీ

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 113 పంచాయతీల కోసం 1046 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరిస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిషేధాజ్ఞలు విధించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు.

News December 13, 2025

నూతన సర్పంచులను సన్మానించిన బండి సంజయ్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సన్మానించారు. వేములవాడ బీజేపీ ఇన్‌ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు నేతృత్వంలో వారిని సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలకపాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతమైన పాలన అందించాలని వారు సూచించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు.