News October 27, 2024
కలెక్టర్ కార్యాలయంలో రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే ఫిర్యాదుల సేకరణకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News November 9, 2024
ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి: కలెక్టర్
ఈనెల 11వ తేదీలోపు ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల వెరిఫికేషన్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ భూముల ధృవీకరణకు జిల్లాలో ఎక్కువగా పెండింగ్ ఉన్న కంబదూరు, కుందుర్పి మండలాల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.
News November 8, 2024
ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్
ఏపీలో ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందుకుగానూ ఈ ఆర్థిక సంవత్సరం లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2024
ఎస్సీ, ఎస్టీల ఉచిత డీఎస్సీ స్క్రీనింగ్ ఆన్‌లైన్ పరీక్ష వాయిదా
ఈనెల 10న జరగాల్సిన ఎస్సీ, ఎస్టీల ఉచిత డీఎస్సీ స్క్రీనింగ్ ఆన్‌లైన్ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల పరీక్ష వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తరువాత పరీక్ష తేదీని తెలియజేస్తామన్నారు.