News January 26, 2025
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

పల్నాడు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రిపబ్లిక్ డే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాలలోనూ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇవ్వటం ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 22, 2025
సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News October 22, 2025
మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.
News October 22, 2025
ఐస్లాండ్లో కనిపించిన దోమలు

ఇందులో విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మంచు దేశానికి దోమలు లేని దేశంగా పేరుంది. తాజాగా వెస్టర్న్ ఐస్ల్యాండ్లోని ఓ అడవిలో ఈ దోమలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నేళ్ల కిందట విమానంలో ఓ దోమను గుర్తించగా తాజాగా సహజ వాతావరణంలోనే ఈ కీటకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఎలా వచ్చాయనే విషయమై కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇది మారిన వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది.