News March 10, 2025
కలెక్టర్ క్రాంతిని కలిసిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎస్పీ కలిశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 30, 2025
జూబ్లీ బైపోల్ వైపు.. నార్త్ ఇండియన్స్ చూపు

జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న బైపోల్ నార్త్ ఇండియన్స్ చూపు మనవైపు తిప్పింది. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు సౌత్ స్టేట్‌లోని మనదగ్గర బై పోల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉపఎన్నికలు సౌత్ ఇండియాలో కేవలం తెలంగాణ (జూబ్లిహిల్స్)లోనే జరుగుతోంది. పై రాష్టాలన్నింటిలోకి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పరిస్థితి రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.
News October 30, 2025
నల్గొండ: మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారు రాంనగర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్‌లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 లోపు అప్లై చేసుకోవాలన్నారు.
News October 30, 2025
జనగామ కలెక్టర్‌ను కలిసిన డీపీఓ

జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా ఎ.నవీన్ గురువారం కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ అధికారులు, డీపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు.


