News July 3, 2024

‘కల్కి’ బుజ్జి కారులో రఘురామ సందడి

image

కల్కి 2898 AD’ సినిమాలో ప్రభాస్‌ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే ఈ కారులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సందడి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన కల్కి చిత్రం ఘనవిజయం సాధించడంతో మూవీ టీంకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

Similar News

News December 1, 2025

మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

News December 1, 2025

జిల్లాలో రోడ్లు అభివృద్ధికి రూ.37.70 కోట్లు నిధులు: కలెక్టర్

image

ప.గో. జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి, కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.37.70 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర రహదారులు, జిల్లాలోని ప్రధాన రహదారులు అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆమె సోమవారం తెలిపారు. ఉండి నియోజకవర్గంలో కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు.

News December 1, 2025

ప.గో.: పోలీస్ శాఖ PGRSకు 13 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి, సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.