News June 28, 2024
‘కల్కి2898 AD’ టీంలో మన ఏలూరు కుర్రోడు

రెబల్స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి2898 AD’ మూవీలో కీలకమైన బుజ్జి రోబోని డిజైన్ చేసిన సభ్యులలో మన ఏలూరు జిల్లా కుర్రోడు ఒకరవడం విశేషం. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టీహబ్లో వర్క్ చేస్తున్నాడు. కల్కి మూవీలోని రోబో తయారీలో భాగస్వామ్యం అయినందుకు పలువురు అతణ్ని అభినందిస్తున్నారు.
☛ CONGRATS రాకేష్
Similar News
News December 7, 2025
భీమవరం: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 7, 2025
HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.
News December 7, 2025
ప.గో: YCPకి జిల్లా కీలక నేత రాజీనామా..!

తాడేపల్లిగూడెంకు చెందిన వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తెన్నేటి జగ్జీవన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపినట్లు జగ్జీవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వైసీపీలో నెలకొన్న పరిణామాలు, పార్టీ విధానాలు, గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.


