News September 23, 2024
కల్తీ నెయ్యితో లడ్డూ చేయలేదు: ధర్మాన
కల్తీ జరిగిందని గుర్తించిన TTD.. ఆ నెయ్యితో లడ్డూలే తయారు చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ‘వాడని నెయ్యి, తయారు కాని లడ్డూలు పట్టుకుని సీఎం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. లడ్డూ తయారీలో కొవ్వు కలిసిందని దుష్ర్పచారం చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారితో రాజకీయాలు బాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు తగవు’ అని ఓ ప్రకటనలో ధర్మాన పేర్కొన్నారు.
Similar News
News October 9, 2024
శ్రీకాకుళం: ఇసుక లోడింగ్‌కు టెండర్ల ఆహ్వానం
జిల్లాలో మొత్తం 6 రీచ్ల వద్ద ఇసుకను మనుషులతో తవ్వకాలు చేసి నిల్వ కేంద్రానికి తరలించి, వినియోగదారుల వాహనాలకు లోడ్ చేసేందుకు గాను టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా భూగర్భ గనులశాఖ కార్యాలయం (కిమ్స్ ఆసుపత్రి వెనుక)లో ఈ నెల 11న ఉదయం 11 గంటల్లోగా సీల్డు టెండర్ల బిడ్ డాక్యుమెంట్లను స్వీకరించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
News October 9, 2024
శ్రీకాకుళం: నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలి
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులతో చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు వచ్చే నెల నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.