News July 4, 2024
కల్లూరు: గుండెపోటుతో RTC బస్సు డ్రైవర్ మృతి
పులిచెర్ల మండలం కొక్కువారిపల్లె సమీపంలో RTC డ్రైవర్ రాఘవయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పుంగనూరు RTC డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి కల్లూరుకి వస్తుండగా మార్గమధ్యంలో ఆర్‌టీసీ డ్రైవర్ రాఘవయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో కండక్టర్ హుటాహుటిన డ్రైవర్‌ను సమీపంలోని పులిచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
Similar News
News October 12, 2024
శ్రీకాళహస్తి స్వామివారి సేవలో బాలకృష్ణ సతీమణి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిహెచ్ఓ నాగభూషణం, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.
News October 12, 2024
చిత్తూరులో ప్రజా పరిష్కార వేదిక వాయిదా
చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 15వ తేదీకి మారుస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈనెల 14న జరగాల్సిన కార్యక్రమాన్ని 15వ తేదీకి మారుస్తున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరారు.
News October 12, 2024
TTDపై అభ్యంతరకరంగా పోస్ట్.. వ్యక్తిపై కేసు
TTD ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చైతన్య అనే వ్యక్తిపై తిరుమల 1టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం పట్టు వస్త్రాలను తీసుకెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.