News March 19, 2025

కల్లూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

కల్లూరు మండలం లింగాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి తాళ్ల శ్రీనివాసరావు (అడిషనల్ డైరెక్టర్ ఇన్ హ్యాండ్లూమ్స్) మృతి చెందారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు గ్రామస్థులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఇటీవలే గ్రామానికి వచ్చినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 15, 2025

KMM: జీవనశైలి మార్పులతో మధుమేహం నియంత్రణ: కలెక్టర్

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహం ‘సైలెంట్ కిల్లర్’ అని పేర్కొంటూ, రోజూ అరగంట నడక, వైట్‌ రైస్‌ తగ్గించడం, చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా నియంత్రణ సాధ్యమన్నారు. పిల్లల్లో షుగర్ పెరుగుతున్నందున ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో 55,829 మంది షుగర్ రోగులకు మందులు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News November 15, 2025

ఖమ్మం: చెరువులకు చేరుతున్న ‘చేప పిల్లలు’

image

ఖమ్మం జిల్లా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మత్స్యశాఖాధికారి జి. శివప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 882 చెరువులలో మొత్తం 3.48 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటివరకు 202 చెరువుల్లో 65 లక్షల కట్ల, రవ్వు, మరిగాల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల స్వావలంబన కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందని ఆయన వివరించారు.

News November 14, 2025

భూ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని శుక్రవారం నిర్వహించిన వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. భూ భారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనర్హుల దరఖాస్తులను డెస్క్ స్క్రూటినీలో తిరస్కరించాలని, అర్హుల దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో తప్పనిసరి పరిశీలన చేయాలన్నారు.