News August 30, 2024
కల్లూరు: ATM కార్డు మార్చేసి..నగదు డ్రా

ATM కేంద్రంలో ఏమార్చి.. కార్డు మార్చేసి రూ.86వేలను అపహరించిన ఘటన ఈ నెల 22న కల్లూరులో చోటుచేసుకుంది. కల్లూరు ASI రాజారెడ్డి కథనం మేరకు.. మండలంలోని కట్టకిందపల్లెకు చెందిన గురుమూర్తినాయుడు ఈనెల 22న కల్లూరులోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో నగదు తీసేందుకు యత్నించగా రాలేదు. పక్కనే ఓ గుర్తు తెలియని వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటించి ఏటీఎం కార్డు మార్చేశాడు.మరుసటిరోజు 86 వేలు డ్రా చేసుకున్నాడు.
Similar News
News December 16, 2025
పుంగనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

పుంగనూరు మండలంలోని సుగాలి మిట్ట వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆగి ఉన్న లారీని మరో మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారు తమిళనాడుకు చెందిన ప్రదీప్, శివ శంకర్, అశోక్‌గా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
News December 15, 2025
కుప్పంలో CBG ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్

క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఊతమిస్తూ AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024’ కింద కుప్పం (M) కృష్ణదాసనపల్లిలో 10 TPD సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్‌ను శ్రేష్ఠా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. నేపియర్ గడ్డి, సేంద్రీయ వ్యర్థాలతో CBGతో పాటు ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ (PROM) ఉత్పత్తి చేయనున్నారు.
News December 15, 2025
చిత్తూరు: 43 ఫిర్యాదుల స్వీకరణ

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి 43 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చీటింగ్–3, కుటుంబ తగాదాలు–5, వేధింపులు–3, భూ తగాదాలు–10, ఇంటి తగాదాలు–5, డబ్బు తగాదాలు–8, ఆస్తి తగాదాలకు సంబంధించిన 9 ఫిర్యాదులు అందాయన్నారు.


