News February 3, 2025
కల్వకుర్తిలో అథ్లెటిక్స్ ఎంపికలకు ఏర్పాట్లు పూర్తి

కల్వకుర్తిలోని బాలుర ఉన్నత పాఠశాలలో నేడు జరిగే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన సూచించారు. ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సోల పోగుల స్వాములు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
పెద్దగట్టు: జాతర భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ

దురాజ్పల్లి పెద్దగట్టు జాతర నేడు అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తాజాగా తనిఖీ చేశారు. జాతర సరళిని పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. ఆయన వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, AR అధనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, DSP రవి, శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, SI, సిబ్బంది ఉన్నారు.
News February 16, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS

@ మెట్పల్లి దొంగల చోరీ కేసులో పోలీసులకు రివార్డులు అందజేసిన ఎస్పీ @ మేడిపల్లిలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య @ జగిత్యాలలో ప్రముఖ చిత్రకారుడు గుండెపోటుతో మృతి @ చింతకుంటలో అగ్నిప్రమాదం.. గుడిసె దగ్ధం @ కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదం.. ధర్మపురి మహిళ మృతి @ తకలపల్లిలో నిప్పంటుకొని వృద్ధురాలు మృతి @ పెగడపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
News February 16, 2025
RR: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ద్రాక్ష పంట సాగు..!

ఉమ్మడి RR జిల్లాలో దశాబ్దం క్రితం 10 వేలకు పైగా ఎకరాల్లో సాగైన ద్రాక్ష ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకు పరిమితమైందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి మారిందని అప్పటిలా భూములు లేకపోవడంతో ద్రాక్ష సాగు తగ్గిపోతున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు. కూలీల ఖర్చులు సైతం పెరుగుతున్నాయని, దిగుమతి సమయంలో ఈదురుగాలి, వడగండ్లతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. మేడ్చల్, శామీర్పేట, కీసరలో అప్పట్లో సాగు చేసేవారు.