News March 9, 2025
కల్వకుర్తిలో జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు

కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్‌ఐ మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలెపు కొండల్ హాజరయ్యారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, డాక్టర్ స్వాములు, ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 23, 2025
స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.
News March 23, 2025
అట్లీ సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్?

తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సినిమాలో మెయిన్ విలన్ పాత్ర అదేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘పుష్ప’ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలోనూ కొంతవరకు నెగటివ్ షేడ్స్ ఉన్న సంగతి తెలిసిందే.
News March 23, 2025
NRPT: జిల్లా క్రీడాకారునికి బ్రాంజ్ మెడల్

నారాయణపేట జిల్లా దామరగిద్ద చెందిన కనకప్ప పారా అథ్లెటిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ విభాగం నందు పాల్గొన్న కనకప్ప 5.30 మీటర్స్ దూకి, ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు రమణ వివరించారు. నారాయణపేట జిల్లాకు చెందిన అభ్యర్థి పతకం సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు,పీడీలు, పీఈటీలు హర్షం వ్యక్తం చేశారు.