News January 23, 2025
కల్వకుర్తిలో దారుణం.. భర్తను చంపేసింది

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో రోకలి బండతో కొట్టి భర్తను హతమార్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా.. కాలనీకి చెందిన లక్ష్మణ్, అతని భార్య మస్తానమ్మల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దది కావడంతో మస్తానమ్మ రోకలిబండతో భర్త తలపై బాదింది. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ ను MBNR ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.
Similar News
News November 24, 2025
టికెట్ ధరల పెంపు.. తప్పుగా తీసుకోవద్దు: మైత్రీ రవి

టికెట్ ధరల పెంపుపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఇండస్ట్రీ వృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఈ కారణంతో 6-7 సినిమాలకు టికెట్ ధరలు పెంచుతున్నాం. ఆ పెంపు రూ.100 మాత్రమే. ఈ అంశాన్ని తప్పుగా తీసుకోవద్దు’ అని చెప్పారు. కాగా టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.
News November 24, 2025
KMR: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేయాలి:DSP

42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో జరిగిన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇరు పార్టీలు చర్చించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
News November 24, 2025
బీజేపీ ‘మిషన్ బెంగాల్’.. టార్గెట్ 160

బిహార్లో భారీ విజయం సాధించిన BJP ఫోకస్ను బెంగాల్ వైపు మళ్లించింది. 2026 ఎన్నికల్లో 160+ సీట్లే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. TMCకి క్షేత్రస్థాయి కార్యకర్తల సపోర్ట్ను బ్రేక్ చేయాలని, మమత అల్లుడు అభిషేక్ బెనర్జీని వ్యతిరేకించే వారిని తమవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తోంది. వారసత్వ రాజకీయం, అక్రమ ఓట్లపై టార్గెట్ చేయాలని చూస్తోంది. హిందూ ఓట్లు పోలరైజ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.


