News January 23, 2025

కల్వకుర్తిలో దారుణం.. భర్తను చంపేసింది

image

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో రోకలి బండతో కొట్టి భర్తను హతమార్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా.. కాలనీకి చెందిన లక్ష్మణ్, అతని భార్య మస్తానమ్మల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దది కావడంతో మస్తానమ్మ రోకలిబండతో భర్త తలపై బాదింది. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ ను MBNR ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.

Similar News

News February 13, 2025

కరీంనగర్: సఖి సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ 

image

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి కేంద్రం, మహిళా సాధికారత విభాగం సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సఖి కేంద్రం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మేనేజ్మెంట్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సఖి సేవలను గురించి అందరికీ తెలిసేలా ప్రజలు సందర్శించే స్థలాల్లో, కలెక్టరేట్ ప్రాంగణంలో బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.

News February 13, 2025

కామారెడ్డి: హాస్టల్‌‌లో ఉండటం ఇష్టం లేక పారిపోయిన విద్యార్థి

image

సిరిసిల్ల గంభీరావుపేట మండలం గోరింటాకు చెందిన శివరామకృష్ణ అనే బాలుుడు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం అతని తల్లి హాస్టల్‌లో వదిలేందుకు తీసుకు వెళ్తుండగా రైల్వే గేటు వరకు వచ్చి పారిపోయినట్లు ఆమె తెలిపింది. మిస్సింగ్ కేసును నమోదు చేసినట్లు కామారెడ్డి పోలీసులు పేర్కొన్నారు.  హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక పారిపోయాడని బాలుని తల్లి చెప్పారు.

News February 13, 2025

వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

error: Content is protected !!