News March 23, 2025
కల్వకుర్తి: అనారోగ్యంతో ఖానాపూర్ మాజీ ఎంపీటీసీ మృతి

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎమ్మెల్యే సొంత గ్రామం ఖానాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ గార్లపాటి సరిత (46) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆమె ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఎంపీటీసీగా ఆమె గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 24, 2025
ASF కలెక్టర్, జడ్జిని కలిసిన నూతన SP

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను, జిల్లా జడ్జి ఎం.వి.రమేశ్‌ను నూతన SP నితికా పంత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆమె ఈరోజు వారిని కలిసి పూల మొక్క అందజేశారు.న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, కేసుల పరిష్కారం, మహిళల భద్రత, నేరాల నియంత్రణపై చర్చించారు.
News November 24, 2025
3 సిక్సులు కొట్టడమే గొప్ప!

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్ ఆ దేశ క్రికెటర్ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
News November 24, 2025
చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్‌పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


