News March 19, 2025
కల్వకుర్తి: ‘ఆలస్యంగా అంబులెన్స్.. ప్రాణం పోయింది..!’

ఓ మహిళ ప్రాణం పోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ప్రసవం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు ఎమర్జెన్సీ నిమిత్తం HYDకు డాక్టర్లు రిఫర్ చేశారు. దీంతో ఆమెను తీసుకెళ్లేందుకు కుటుంబీకులు 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా 25 నిమిషాల తర్వాత వచ్చింది. అయితే అంబులెన్స్ వచ్చినా తాను ఇప్పుడు రాలేనంటూ డ్రైవర్ చెప్పడంతో మరింత ఆలస్యమైంది. ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లగా మార్గమధ్యలో చనిపోయింది.
Similar News
News December 7, 2025
ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR చాలా సన్నగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కొత్త లుక్ వైరల్ అవుతోంది. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చున్న ఫొటో చూసి లుక్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో బాడీ డబుల్ లేకుండా ఎన్టీఆరే స్టంట్స్ చేస్తారని సమాచారం.
News December 7, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 7, 2025
HYD: జుట్టు ఊడుతోందా? మీకోసమే!

నగరవాసులకు ఒత్తైన జుట్టు కలగా మారుతోంది. మనోళ్లని హెయిర్లాస్, చుండ్రు తీవ్రంగా వేధిస్తున్నాయి. 30ఏళ్లలోపు 60% మందికి బాల్డ్హెడ్, 30% మందికి జట్టురాలుతోందని ఓ సర్వే వెల్లడించింది. ఒత్తిడి, హార్డ్ వాటర్కు VIT-D, VIT-B12 లోపాలు తోడవుతున్నాయి. VIT-D కణాలు ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది. ఎండతగలకుండా ఉదయాన్నే ఆఫీస్కు చేరుకునేవారిలో VIT-D లోపం, మూడ్ స్వింగ్స్, బరువుపెరుగుదల ఉంటాయని వివరించింది.


