News April 11, 2025
కల్వకుర్తి: కలెక్టర్‌ను కలిసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు

కల్వకుర్తి తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్‌ను సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు బాలకృష్ణ జిల్లా కలెక్టర్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జూలూరి రమేష్ బాబు, రామస్వామి తదితరులు ఉన్నారు.
Similar News
News November 26, 2025
కస్టమర్లను అలర్ట్ చేసిన SBI

తమ పేరుతో వాట్సాప్‌లో APK ఫైల్స్ పంపుతూ మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంపై SBI స్పందించింది. KYC అప్డేట్, రివార్డ్ పాయింట్స్ అంటూ సైబర్ నేరగాళ్లు పంపే SMS/వాట్సాప్ మెస్సేజ్‌లను నమ్మి మోసపోవద్దని సూచించింది. SBI ఎప్పుడూ apk ఫైల్స్ & లింక్స్ పంపదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫైల్స్‌ను క్లిక్ చేస్తే డేటా అంతా నేరగాళ్లకు చేరుతుందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మోసపోతే 1930కి కాల్ చేయాలని కోరింది.
News November 26, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు పూర్తి బందోబస్తు: ఎస్పీ

జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్ జిల్లా, రాష్ట్ర చెక్ పోస్టులను కట్టుదిట్టంగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రభావితం చేసే అక్రమ రవాణా జరగడానికి వీలు లేదని పేర్కొన్నారు.
News November 26, 2025
అమరావతిలో తిరుపతి జిల్లా విద్యార్థుల ప్రదర్శన

భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో విద్యార్థులకు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా నుంచి పలువురు విద్యార్థులు హజరయ్యారు. వారిలో వ్యవసాయ శాఖ మంత్రిగా సాగర్, మానవ వనరుల శాఖ మంత్రిగా చిన్మయి, ప్రతిపక్ష సభ్యునిగా భవ్య శ్రీ, మార్షల్ పాత్ర వెంకట దినకర్ పోషించారు. రైతే రాజు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సాగర్ చక్కగా వివరించారు.


