News April 11, 2025
కల్వకుర్తి: కలెక్టర్‌ను కలిసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు

కల్వకుర్తి తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్‌ను సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు బాలకృష్ణ జిల్లా కలెక్టర్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జూలూరి రమేష్ బాబు, రామస్వామి తదితరులు ఉన్నారు.
Similar News
News April 21, 2025
ద్వారపూడి: కోనసీమ ఏకైక రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు కరవు

కోనసీమ జిల్లాలో ఉన్న ఏకైక ద్వారపూడి రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు అమలాపురంలో సోమవారం వినతి పత్రాన్ని అందజేసినట్లు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కొన సత్యనారాయణ పేర్కొన్నారు. మండపేట మండలం ద్వారపూడి రైల్వే స్టేషన్‌లో పలురైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరామన్నారు. అమలాపురం బీజేపీ నేత నల్లా పవన్ కుమార్ స్వగృహంలో ఎంపీని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
News April 21, 2025
విజయనగరం పీజీఆర్ఎస్‌కు 205 వినతులు

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 205 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్కర్, JC సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 205 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 138 వినతులు అందాయి. జేసీ సమీక్షిస్తూ గడువు లోపలే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
News April 21, 2025
అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పిన రోహిత్

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్‌లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.