News April 11, 2025
కల్వకుర్తి: ‘కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నాలు..?’

కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో కీలక పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 2, 2025
భద్రాద్రి: రెండో రోజు అందిన నామినేషన్ వివరాలు

గ్రామపంచాయతీ ఎన్నికల 2వ విడతలో 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 2వ రోజు సోమవారం మండలాల వారీగా అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ వివరాలు.. అన్నపురెడ్డిపల్లి – 8, 6, అశ్వారావుపేట – 15, 13, చండ్రుగొండ – 9, 8, చుంచుపల్లి – 14, 13, దమ్మపేట – 19, 19, ములకలపల్లి -13, 13, పాల్వంచ -22, 18, మొత్తం సర్పంచ్ 100, వార్డు సభ్యులకు 90 నామినేషన్లు వచ్చాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
News December 2, 2025
కృష్ణా: టెన్త్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరయల్స్

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో 60 వేలమందికి పైగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి వందరోజుల ప్రణాళిక అమలు చేయనున్నారు. అదే రోజు తుది పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా స్ఫూర్తి మెటీరియల్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా SCERT మరో మెటీరియల్ అందిస్తుంది. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి. పిల్లలు అందరూ ఒక విధంగా పరీక్షలకు సిద్ధం కావాలని మెటీరియల్ ఆదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
News December 2, 2025
సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<


