News November 11, 2024
కల్వకుర్తి: తాండ్రలో నేడు సదర్ సమ్మేళనం

కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవస్థానం వద్ద సదర్ సమ్మేళనం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు తెలిపారు.
Similar News
News January 5, 2026
MBNR: ‘పీఎంశ్రీ’.. జిల్లా స్థాయి పోటీల షెడ్యూల్

మహబూబ్ నగర్ జిల్లా పీఎంశ్రీ పాఠశాల జిల్లా స్థాయి పోటీలకు క్రీడాకారులు సిద్ధం కావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. షెడ్యూలు ఇలా!
✒6న బాల,బాలికలకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు
✒6న బాల, బాలికలకు ఫుట్ బాల్ అథ్లెటిక్స్ పోటీలు
అథ్లెటిక్స్‌లో పాల్గొనే పియంశ్రీ పాఠశాల క్రీడాకారులు ఒక్క ఈవెంట్‌లో ఒక్కరు మాత్రమే పాల్గొనాలన్నారు.
News January 5, 2026
మహబూబ్‌నగర్: పేదలకు వరం ‘గృహజ్యోతి’

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News January 5, 2026
MBNR: 87126 59360.. SAVE చేసుకోండి

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తుతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100/112’ లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబరు 87126 59360కు సమాచారం అందించాలని ఆమె కోరారు.


