News April 3, 2025
కల్వకుర్తి: దొడ్డి కొమురయ్యకు హరీశ్‌రావు నివాళి

సాయుధ పోరాట యోధుడు తెలంగాణ కోసం తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య నేటి యువతకు ఆదర్శం కావాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Similar News
News December 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 4, 2025
The ‘Great’ హైదరాబాద్

విలీనంతో HYD దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. విలీనం అనంతరం బల్దియా స్థితి గతులను పరిశీలిస్తే..
GHMC విస్తీర్ణం: 2735 చదరపు కిలో మీటర్లు
జనాభా: దాదాపు కోటిన్నర
మేయర్, 149 మంది కార్పొరేటర్లు+300 డివిజన్లకు ఆస్కారం
కమిషనర్, 10 మంది అదనపు కమిషన్లర్లు
23 మంది MLAలు+కొత్తగా ఇద్దరు MLAలు?
6 జోన్‌లు+ఆరుగురు జోనల్ కమిషనర్లు
57 సర్కిళ్లు+57మంది డిప్యూటీ కమిషనర్లు
News December 4, 2025
ఏపీకి రూ.125కోట్లు మంజూరు: పెమ్మసాని

AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడం, 10 పట్టణ స్థానిక సంస్థల్లో(ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. PM మోదీ దూరదృష్టితో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ నాయకత్వంలో రాష్ట్రంలో పాలన మరింత బలోపేతమైందని ట్వీట్ చేశారు.


