News April 3, 2025

కల్వకుర్తి: దొడ్డి కొమురయ్యకు హరీశ్‌రావు నివాళి 

image

సాయుధ పోరాట యోధుడు తెలంగాణ కోసం తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య నేటి యువతకు ఆదర్శం కావాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్‌లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Similar News

News April 20, 2025

DSC: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

image

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

News April 20, 2025

డీఎస్సీ: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్ని పోస్టులంటే?

image

రాష్ట్ర్లంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 16347 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఉమ్మడి గుంటూరులో 1143 కొలువులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్ఏ తెలుగు 40, ఉర్దూ 2, హిందీ 57, ఇంగ్లీష్ 69, మ్యాథ్స్ 35, ఫిజిక్స్ 58, బయలాజికల్ సైన్స్ (తెలుగు 85, ఉర్దూ 1), సోషల్ (తెలుగు 106, ఉర్దూ 03) ఎస్.ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 166, ఎస్జీటీ (తెలుగు 470, ఉర్దూ 51) ఉన్నాయి.

News April 20, 2025

థ్రిల్లింగ్ విక్టరీ.. అద్భుతం చేసిన ఆవేశ్

image

నిన్న LSGతో మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన RR మొదటి నుంచీ గెలుపు దిశగానే సాగింది. 17 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ 156/2. 18 బంతుల్లో 25 రన్స్ కావాలి. అంతా విజయం ఖాయమనుకున్నారు. అయితే LSG బౌలర్ ఆవేశ్ ఖాన్ అద్భుతం చేశారు. 18వ ఓవర్‌లో జైస్వాల్, పరాగ్‌ను ఔట్ చేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. చివరి ఓవర్‌లో RRకు 9 రన్స్ కావాల్సి ఉండగా 6 పరుగులే ఇచ్చి హెట్మైర్ వికెట్ కూల్చి LSGకి విక్టరీ అందించారు.

error: Content is protected !!