News March 23, 2025
కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.
Similar News
News October 22, 2025
కరీంనగర్: ‘నిరుద్యోగులకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు’

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిరుద్యోగులకు HYDలోని TOMCOM సంస్థ ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్ ప్లేస్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ఈ కోర్సు మూడేళ్లు ఉంటుందని, శిక్షణ సమయంలో రూ. లక్ష స్టయిఫండ్తో పాటు, నర్సుగా ఉద్యోగంలో చేరిన తర్వాత సుమారు రూ. 3 లక్షల జీతం ఉంటుందని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 6302292450, 9440051763 నంబర్లలో సంప్రదించవచ్చు.
News October 22, 2025
వనపర్తి: గురుకులాల్లో మిగిలిన సీట్ల దరఖాస్తుకు రేపే లాస్ట్

జిల్లాలోని SC వెల్ఫేర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 81 సీట్లు భర్తీ చేయనున్నట్లు ఇటీవల కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపిన విషయం తెలిసిందే. కాగా రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ సీట్ల భర్తీ కోసం TG CET ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లు ఉన్నాయి.
News October 22, 2025
ప్రకాశం జిల్లాకు NDRF బృందాలు: హోం మంత్రి

ప్రకాశం జిల్లాకు మరో రెండు రోజులపాటు భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగానికి హోం మంత్రి అనిత బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు NDRF బృందాలను పంపించేలా ఆమె ఆదేశించారు. దీంతో ప్రకాశం జిల్లాపై ఎలాంటి తుఫాన్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు, కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో సిద్ధమయ్యారు.


