News April 2, 2025
కల్వకుర్తి: పిల్లల మృతిపై వీడిన మిస్టరీ.. తల్లే హంతకురాలు!

HYD అమీన్పూర్లో గత నెల 27న కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఆకస్మికంగా మృతిచెందగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మెదక్పల్లి వాసి చెన్నయ్య భార్య తన టెన్త్ క్లాస్ స్నేహితుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఆమె ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది.
Similar News
News September 15, 2025
NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.
News September 15, 2025
సంగారెడ్డి జిల్లాలో గేమ్స్ వాయిదా

సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 16, 17న జరగాల్సిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను వాయిదా వేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పోటీలు నిర్వహించాల్సిన మైదానాలు వర్షం నీటితో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 15, 2025
MHBD: ఘోరం.. యూరియా కోసం వెళ్లి మృత్యుఒడికి

యూరియా కోసం వెళ్లిన ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బొద్దుగొండకు యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా గూడూరు మండలంలో జగన్ నాయకులగూడెం వద్ద వేగంగా వచ్చిన బోలెరో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దారావత్ వీరన్న, బానోత్ లాల్య అనే ఇద్దరు రైతులు మృతి చెందారు. ఇంటికి యూరియా బస్తా తెస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబాలకు ఇది తీరని విషాదాన్ని మిగిల్చింది.