News February 13, 2026
కల్వకుర్తి: భార్య గెలుపు.. భర్త ఓటమి!

కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తల ఫలితం చర్చనీయాంశమైంది. 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రత్నమాల 425 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించగా, 13వ వార్డు నుంచి పోటీ చేసిన ఆమె భర్త బృంగి ఆనంద్ కుమార్ ఓటమి పాలయ్యారు. భార్య విజయం సాధించినా, భర్త ఓడిపోవడంతో ఆ కుటుంబంలో మిశ్రమ ఫలితం నెలకొంది.
Similar News
News March 9, 2026
మెట్రో-ఫ్లైఓవర్లతో విశాఖ ట్రాఫిక్‌కు పరిష్కారం

విశాఖలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు కీలకం కానుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్. రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ వివరాలను సీఐఐ విజయవాడ వార్షిక సమావేశంలో వెల్లడించారు. 76.70 కి.మీ. పొడవున 4 కారిడార్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎన్‌హెచ్-16 వెంట మెట్రో-కమ్ నాలుగు లేన్ ఫ్లైఓవర్ ప్రతిపాదించామన్నారు. మొత్తం 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.
News March 9, 2026
నెతన్యాహుతో మాట్లాడే డిసైడ్ చేస్తా: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆపాలనేది ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అది సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, సరైన సమయంలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తాము దాడి చేయకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అంతం చేసి ఉండేదన్నారు. కాగా ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ యుద్ధం పదో రోజుకి చేరింది. మరోవైపు సౌదీపై దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
News March 9, 2026
మేడ్చల్ జిల్లాలో రైతుల రిజిస్ట్రేషన్ 89% పూర్తి

మేడ్చల్ జిల్లాలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంత గందరగోళంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ రైతు రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడంతో అగ్రికల్చర్ విస్తరణ అధికారులకు ఇది తలనొప్పిగా మారింది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందనుంది. జిల్లాలో మొత్తం 19,589 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 89 శాతం మాత్రమే పూర్తైంది.


