News February 25, 2025
కల్వకుర్తి: మార్చి 6 నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు.!

కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్లు పట్టణంలోని అలివేలు మంగ సమేత వెంకటగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 6 నుంచి 10వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకుడు గూడ కృష్ణమాచార్యులు తెలిపారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News November 20, 2025
ములుగు: గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనెల 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా పలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అదేవిధంగా పలువురిని సన్మానించారు. గ్రంథాలయాలను మంత్రి సీతక్క చొరవతో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
News November 20, 2025
మదనపల్లెలో 10 కిలోల టమాటాలు రూ.610

మదనపల్లెలో టమాటా ధరలు పైపైకి పోతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌కు గురువారం 135 మెట్రిక్ టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు రూ.610 అమ్ముడు పోగా.. రెండవ రకం రూ.580, మూడవ రకం రూ.500లతో కొనుగోలు జరుగుతున్నట్లు టమాటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. పంట దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు వారు తెలిపారు.
News November 20, 2025
శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్‌ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.


