News February 12, 2026

కల్వకుర్తి: వేంకటేశ్వర స్వామి దివ్య దర్శనం..!

image

కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష అర్చనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్న ఈ వేడుకలకు పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, స్వామివారి కృపకు పాత్రులయ్యారని ఆలయ కమిటీ వారు తెలిపారు.

Similar News

News March 13, 2026

ఉస్మానియా తరలింపు వెనక అసలు ప్లాన్ ఇదే!

image

ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల్లో అత్యంత కీలకం కానుంది. అఫ్జల్‌గంజ్‌లోని 26 ఎకరాల భూమిని ‘హెల్త్ టూరిజం’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం లోలోపల కసరత్తు చేస్తోందని సమాచారం. పాత వారసత్వ భవనాన్ని కేవలం మ్యూజియంగా మార్చి, మిగిలిన ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించే ప్రతిపాదన బడ్జెట్ ప్రసంగంలో ‘పరోక్షంగా’ వెల్లడికానుంది.

News March 13, 2026

టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

image

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST

News March 13, 2026

తిరుపతి: శ్రీరమాదేవి హాస్పిటల్‌పై విచారణ

image

తిరుపతిలోని శ్రీరమాదేవి హాస్పిటల్‌పై తమకు ఫిర్యాదు అందినట్లు DMHO బాలాజీ నాయక్ తెలిపారు. పలమనేరు నుంచి బ్రెయిన్ డెడ్‌తో వచ్చిన శ్రీనివాస్‌కు సర్జరీ చేశారు. తర్వాత హార్ట్ స్ట్రోక్‌తో మృతిచెందారు. డబ్బుల కోసం <<19345828>>మృతదేహాన్ని ఇవ్వలేదనే <<>>ఫిర్యాదుపై విచారణకు ఆదేశించామని, 2వారాల్లో నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని DMHO తెలిపారు. తానే ఫోన్ చేసి మృతదేహాన్ని ఇవ్వాలని ఆసుపత్రి యజమానికి సూచించానన్నారు.