News February 16, 2025
కల్వకుర్తి: ‘స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నాం’

ఎర్రవల్లి – గోకారం జలాశయ బాధితులు, ఎర్రవల్లి గ్రామ పంచాయితీ ప్రజలు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరించారు. ఊర్లోకి ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రచారానికి రావడానికి వీలు లేదని హెచ్చరించే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జలాశయ సామర్థ్యం తగ్గించి ఎర్రవల్లి గ్రామపంచాయితీ ముంపుకు గురికాకుండా ఉంటుందని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు.
Similar News
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్ఖాన్పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్ను సందర్శించారు.
News December 8, 2025
మన్యం బిడ్డను సత్కరించిన కలెక్టర్

అండర్-19 క్రికెట్ టీ-20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాంగి కరుణకుమారిని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. కరుణకుమారికి శాలువా కప్పి అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు. పాడేరు(M)లోని మారుమూల గ్రామమైన వంట్లమామిడిలో ఆదివాసీ కుటుంబంలో పుట్టిన కరుణకుమారి అంతర్జాతీయ క్రికెట్లో రాణించడం గొప్ప విషయమని కలెక్టర్ కొనియాడారు.
News December 8, 2025
తిరుచానూరు: అర్చకుల ముసుగులో ఒక్కరు కాదు ఇద్దరు

ఆలయంలో అర్చకులు అంటే భక్తులకు చాలా గౌరవం. కానీ టీటీడీ పరిధిలోని తిరుచానూరు ఆలయంలో పనిచేసే అర్చకుల ముసుగులో ఇద్దరు అనధికారికంగా ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. ఎప్పటి నుంచి ఉన్నారు..? ఎవరి ద్వారా ఆలయంలో ఉన్నారు..? ఇంత జరుగుతున్నా ఎందుకు అధికారులు గుర్తించలేదనే వివరాలు నమోదు చేశారని తెలుస్తోంది. నేడో.. రేపో నివేదిక ఉన్నతాధికారులకు అందించనున్నారని సమాచారం.


