News March 26, 2025
కల్వకుర్తి: KLI కాల్వ డైవర్షన్, గేట్ వాల్ పనులు చేపట్టాలని వినతి

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు నాలుగేళ్లుగా నత్త నడకన కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. వందల కిలోమీటర్లు కాల్వలు తవ్వినప్పటికీ వాటికి డ్రైవర్ సెన్స్, గేట్ వాల్స్ ఏర్పాటు చేయకపోవడంతో కృష్ణా జలాలు వృథాగా పోతున్నాయని ఆయన అన్నారు. మంత్రి వెంటనే స్పందించి ఈ వేసవిలో పనులు పూర్తి చేయించాలని కోరారు.
Similar News
News April 2, 2025
ప్రకృతికి తోడుగా నాలుగున్నర లక్షల మంది

HCU భూముల వివాదంపై అటు విద్యార్థులు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే.. ఇన్‌స్టాలో నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఆ భూములను రక్షించాలంటూ స్టోరీల ద్వారా గళమెత్తినవారి సంఖ్య నాలుగున్నర లక్షలకు చేరింది. యువత అంతా తమ ఓటు ప్రకృతికేనంటూ మద్దతు తెలుపుతున్నారు. మూగ జీవులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ నినదిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
News April 2, 2025
జపాన్‌కు పొంచి ఉన్న ముప్పు.. డేంజర్‌లో 3లక్షల మంది ప్రాణాలు!

జపాన్‌లో త్వరలోనే అతిపెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటుందని, జపనీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విపత్తు భారీ విధ్వంసానికి కారణమవుతుందని, సునామీలు సంభవించి ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని చెబుతున్నారు. రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఇటీవలే మయన్మార్‌లో వచ్చిన భూకంపానికి వేల మంది చనిపోయారు.
News April 2, 2025
అల్లు అర్జున్ పేరులో మార్పు?

‘పుష్ప-2’ సినిమాతో భారీ విజయం అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన వివాదాస్పద ఘటనలతో పాటు కెరీర్‌లో మరిన్ని విజయాల కోసం ఆయన తన పేరులో సంఖ్యాపరమైన మార్పులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. తన పేరు స్పెల్లింగ్‌లో అదనంగా U, Nలు జోడించాలని యోచిస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. దీనిపై బన్నీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.