News January 24, 2025
కల్వకుర్తి: UPDATE.. క్షణికావేశంలో రోకలి బండతో దాడి.. భర్త మృతి
కల్వకుర్తిలో భార్య <<15238142>>రోకలి బండతో<<>> కొట్టడంతో భర్త మృతిచెందిన విషయం తెలిసిందే. SI మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో లక్ష్మణ్(43) భార్య మస్తానమ్మ, పిల్లలతో కలిసి ఉంటున్నారు. బుధవారం రాత్రి దంపతులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశంలో ఉన్న భార్య రోకలి బండతో తలపై కొట్టడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Similar News
News January 25, 2025
డాలర్‌తో రూపాయి క్షీణతపై మోదీకి కాంగ్రెస్ సెటైర్
డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని విమర్శించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత మోదీ పాలన వరకు రూపాయి క్షీణించడంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందో తెలుపుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఇందులో మోదీదే అత్యధిక వాటా అంటూ పేర్కొంది. పై ఫొటోలో దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. రూపాయి విలువ భారీ పతనం మోదీ పాలనలో జరిగిందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.
News January 25, 2025
నంద్యాలలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి ఫరూక్
తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే నంద్యాలలో రూ.8కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించి పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నంద్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.
News January 25, 2025
మహానందిలో 1.20లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం: ఈవో
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది 1,10,000 లడ్డూ ప్రసాదాలు విక్రయించామని మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాలు సరిపడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం 1,20,000 లడ్డూలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు విక్రయిస్తామన్నారు.