News April 5, 2025
కల్వకుర్తి: WOW.. విత్తనాల ముగ్గు చూశారా..!

కల్వకుర్తి పరిధి కడ్తాల్ మండలం అస్మాన్‌పల్లిలో శుక్రవారం విత్తనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విత్తనాలతో వేసిన ముగ్గు అందరినీ ఆకట్టుకుంది. దేశంలోని నలుమూలల నుంచి వ్యవసాయ సంబంధిత శాస్త్రవేత్తలు, నిపుణులు, రైతులు పాల్గొన్నారు. వేలాది విత్తనాలతో మొత్తం 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
Similar News
News April 6, 2025
నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ అడుగులు పడ్డాయి. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
News April 6, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ∆} ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
News April 6, 2025
హరీశ్.. నీ లేఖల పురాణం ఆపు: బీర్ల ఐలయ్య

హరీశ్ రావును చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని MLA బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన రాసిన లేఖపై స్పందిస్తూ.. ‘పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న హరీశ్ ఇప్పుడు సుద్ద పూస మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ పాలన చేస్తుంటే హరీశ్ రావు లేఖల పేరుతో నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నాడు. రాహుల్ గాంధీకి, KCR కుటుంబానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ అని ఐలయ్య దుయ్యబట్టారు.