News October 9, 2024
కల్హేర్: ఒకే గ్రామం నుంచి ఆరుగురికి టీచర్ జాబ్స్

డీఎస్సీ తుది జాబితాల్లో కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన యువత సత్తా చాటారు. గ్రామానికి చెందిన మల్లేశ్, లక్ష్మణ్, సురేశ్ , సతీశ్, స్వాతి, అరుణ్ టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో వారి తల్లితండ్రులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. వీరంతా మార్డి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదినవారే. తాజాగా గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక కావడంతో గ్రామస్థులు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.
-CONGRATS
Similar News
News September 17, 2025
జాతీయ స్థాయిలో మెదక్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు రెంజుకి షోటోకాన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ మాస్టర్ నగేశ్ తెలిపారు. ముంబైలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరగగా మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు బ్లాక్ బెల్ట్ విభాగంలో అండర్ -13 స్వరూప్ సింగ్, అండర్-16 అబ్దుల్లా,
అండర్-17లో సూరజ్ గోల్డ్ మెడల్స్తో పాటు ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు.
News September 17, 2025
మెదక్: కలెక్టరేట్ త్రివర్ణమయం

17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్ మూడు రంగుల విద్యుత్ దీపాలతో త్రివర్ణ మయంగా ముస్తాబు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
News September 16, 2025
నర్సాపూర్: ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు పరిశీలించారు, పలు రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.