News May 12, 2024
కల్హేర్: దూడను చంపిన చిరుత

నాగధర్- సంజీవర్‌రావుపేట్ శివారులో పోలంలో దూడను చిరుత చంపేసింది. రైతు గోపాల్‌రెడ్డి వివరాలిలా.. గోపాల్‌రెడ్డి పొలంలో పశువులను మేపుతున్నారు. భోజనానికి ఇంటికి వెళ్లగా.. చిరుత దాడిచేసి దూడను చంపినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అటవీశాఖ, పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని నాగదర్ FBO శ్రీకాంత్ సందర్శించి, పంచనామా నిర్వహించారు.
Similar News
News December 11, 2025
మెదక్ జిల్లాలో 20.52% ఓటింగ్

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9 గంటల వరకు 20.52 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వణికించే చలి ఉన్నప్పటికీ ప్రజలు ఉదయం నుంచే ఓటు వేసేందుకు బారులు తీరి ఉన్నట్లు వివరించారు.
News December 11, 2025
మెదక్: నేడు 144 సర్పంచ్, 1068 వార్డులకు పోలింగ్

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో
సర్పంచ్ స్థానాలు మొత్తం: 160
ఏకగ్రీవం: 16
మిగిలిన సర్పంచ్ స్థానాలు: 144
అభ్యర్థులు: 411
వార్డులు మొత్తం: 1402 (332 ఏకగ్రీవం) పాపన్నపేట మండలంలోని రెండు వార్డులకు నామినేషన్లు రాలేదు.
పోటీ చేసే వార్డులు: 1068
అభ్యర్థులు: 2426 మంది
పోలీంగ్ కేంద్రాలు: 1068
ఓటర్లు: 1,74,356
News December 11, 2025
మెదక్: నేడు 144 సర్పంచ్, 1068 వార్డులకు పోలింగ్

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో
సర్పంచ్ స్థానాలు మొత్తం: 160
ఏకగ్రీవం: 16
మిగిలిన సర్పంచ్ స్థానాలు: 144
అభ్యర్థులు: 411
వార్డులు మొత్తం: 1402 (332 ఏకగ్రీవం) పాపన్నపేట మండలంలోని రెండు వార్డులకు నామినేషన్లు రాలేదు.
పోటీ చేసే వార్డులు: 1068
అభ్యర్థులు: 2426 మంది
పోలీంగ్ కేంద్రాలు: 1068
ఓటర్లు: 1,74,356


