News March 28, 2025
కళకళలాడుతోన్న చార్మినార్

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్ బజార్, రాత్ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
Similar News
News November 26, 2025
సిద్దిపేట: సమయం లేదు మిత్రమా.. పరిగెత్తాల్సిందే !

గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఎన్నికల తేదీలు దగ్గరే ఉండడంతో ఆశావాహులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉండగా తొలి విడతలో దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్పూర్, మర్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 163 జీపీలు,1,432 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి.
News November 26, 2025
విభిన్న ప్రతిభావంతులు రాణించాలి: డీఈఓ

విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి, విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
News November 26, 2025
వైరల్ అయ్యాక అసభ్యకర మెసేజ్లు వచ్చాయి: నటి

ఆకర్షణీయమైన లుక్స్తో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాత తనకు అసభ్యకరమైన మెసేజ్లు వచ్చాయని నటి గిరిజా ఓక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆఫర్లేమీ రాలేదు. కానీ చాలా మంది మెసేజ్లు పంపారు. ఒక అవకాశం ఇస్తే మీ కోసం ఏదైనా చేస్తానని.. వాళ్లతో గంట గడిపేందుకు రేటు ఎంతో చెప్పాలని కొందరు అభ్యంతరకర మెసేజ్లు పంపారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.


