News September 3, 2024

కళాశాలలో రిపోర్ట్ చేసేందుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గత నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా 29న సీట్లను కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 149 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

Similar News

News September 15, 2024

LHMS సేవను ప్రజలు వినియోగించుకోవాలి: SP

image

జిల్లా ప్రజలు ఎవరైనా తమ ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేటప్పుడు మీ ఇంటి భద్రత కోసం జిల్లా పొలీసు వారి వద్దనున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం అనే టెక్నాలజీని వినియోగించుకోవాలని SP మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ సేవ పూర్తిగా ఉచితమన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్స్ లో ఉన్న ” LHMS AP Police” యాప్ ను డౌన్లోడ్ చేసి మీ వివరాలను ఫిల్ చేయాలన్నారు. తద్వారా సేవలు అందుతాయన్నారు.

News September 15, 2024

SKLM: ఇక మండలానికి ఒక్క MEO ఉండనున్నారా..?

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలానికి ఇద్దరు ఎంఈఓలు విధానానికి తాజాగా కూటమి ప్రభుత్వం స్వస్తి పలకనుందనే సంకేతాలు కనిపిస్తాయి.. ఇక ఒక్క ఎంఈఓతోనే మండల విద్యాశాఖను పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం స్కూల్ కాంప్లెక్స్‌లను పటిష్ఠం చేయనుంది. జిల్లాలోని శ్రీకాకుళం,టెక్కలి,పలాస డివిజన్ల పరిధిలోని 38 మండలాల్లో ఇక ఒక్కరే ఎంఈఓ ఉండనున్నారు అనే సమాచారం జిల్లా అధికారులకు చేరింది.

News September 15, 2024

నరసన్నపేట: మద్యం సీసాలో బొద్దింక

image

మద్యం సీసాలో బొద్దింకని చూసి మందుబాబు నివ్వెరపోయాడు. కోమర్తి గ్రామానికి చెందిన అప్పన్న నరసన్నపేట బండివీధి సమీపంలో ఓ ప్రభుత్వ దుకాణంలో ఈ నెల 12న మద్యంసీసా కొనుగోలు చేశాడు. అనంతరం పరిశీలించగా అందులో బొద్దింక కనిపించింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎక్సైజ్ సీఐ లక్ష్మి వద్ద ప్రస్తావించగా తమ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.