News July 29, 2024

కళింగపట్నం బీచ్ ప్రత్యేకతలు ఇవే..

image

కళింగపట్నం ఓడరేవు శ్రీకాకుళం గార మండలంలో ఉంది. బంగాళాఖాతం బడ్డున ఉన్న ప్రాచీన ఓడరేవుగా ప్రసిద్ధి. రాష్ట్రమంతటా పేరుగాంచిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ఇక్కడిదే. ఇక్కడే వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మదీనా సాహేబ్ సమాధి ఉంది. బ్రిటిష్ వారు లైట్ హౌస్‌ను 1876 నిర్మించారు. దీనిని మళ్లీ ప్రభుత్వం 1982లో పునర్నిర్మించింది. కళింగపట్నం బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

Similar News

News November 18, 2025

శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్‌లో కుప్ప కూలిన అధ్యాపకుడు

image

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్‌లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.

News November 18, 2025

గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

image

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.