News December 25, 2024

కళ్యాణదుర్గం మండలంలో యువరైతు ఆత్మహత్య

image

కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురం గ్రామంలో మంగళవారం విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువరైతు కార్తీక్ (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కార్తీక్ పంటల సాగు కోసం రూ.12 లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 18, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం: కలెక్టర్

image

నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ అంకితభావంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు.

News January 17, 2025

సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఫిబ్రవరి 13, 14, 15వ తేదీల్లో సేవాఘడ్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రెవెన్యూ భవనంలో ఫిబ్రవరిలో గుత్తి పరిధిలో నిర్వహించే సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు.

News January 17, 2025

వీరుడా.. ఇక సెలవు

image

విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి (45) అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లిలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. అమర్‌రహే అంటూ ప్రజలు నివాళులర్పించారు.