News December 15, 2024
కళ్యాణదుర్గం: ముగిసిన మెగా జాబ్ మేళా
కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న మెగా జాబ్ మేళా శనివారం రాత్రి ముగిసింది. దేశంలోని 205 కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరయ్యాయి. ఈ సందర్భంగా 8000 మంది నిరుద్యోగ యువతీ, యువకులను ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు. మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 22, 2025
అనంతపురానికి తారల రాక
అనంతపురంలో నేడు ‘డాకు మహారాజ్’ మూవీ <<15219121>>టీమ్<<>> సందడి చేయనుంది. నగరంలోని శ్రీనగర్ కాలనీ సమీపంలో సాయంత్రం జరగనున్న విజయోత్సవ వేడుకకు సినీ తారలు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగ వంశీ తదితరులు సందడి చేయనున్నారు. మరోవైపు పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.
News January 22, 2025
మడకశిరలో ₹2400 కోట్ల పెట్టుబడి!
భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.కళ్యాణిని దావోస్‌లోమంత్రి నారా లోకేశ్ కలిశారు. రక్షణ తయారీ ప్రాజెక్టు గురించి చర్చించారు. మడకశిర నియోజకవర్గం ముర్దనహళ్లిలో 1000 ఎకరాల్లో ₹2400 కోట్లతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కళ్యాణి తెలిపారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి లోకేశ్ ఆయనను కోరారు.
News January 22, 2025
రుణ పరిమితిపై నిర్ణయం: అనంతపురం కలెక్టర్
అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హల్‌లో మంగళవారం డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా పలు పంటలకు మంజూరు చేసే రుణ పరిమితిని ఖరీఫ్-2025, రబీ 2025-26 సంవత్సరాలకు నిర్ణయించామన్నారు. ఈ పరిమితిని రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం కోసం పంపినట్లు వివరించారు.