News July 22, 2024

కళ్యాణి ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తివేత

image

కళ్యాణి ప్రాజెక్ట్ రెండు వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 450 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి, మరో 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు ఏఈ శివ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను ప్రస్తుతం 408.50 మీటర్లు నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ భాగం నుంచి 650 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ఏఈ తెలిపారు.

Similar News

News December 12, 2024

NZB: తాగుబోతు ఎఫెక్ట్.. నిలిచిన ట్రాఫిక్

image

నిజామాబాద్ నీలకంఠేశ్వర దేవాలయం సమీపంలో ఓ తాగుబోతు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. అక్కడి ఓ వైన్స్ ఎదుట రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో నిజామాబాద్- ఆర్మూర్ ప్రధాన రూట్ లో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది.

News December 12, 2024

బోధన్‌లో విద్యుత్తు అధికారుల పొలంబాట

image

బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ట్రాన్స్‌కో డీఈ ముక్త్యార్ హైమద్ మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు తమ బోరు మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఈ నాగేష్ కుమార్, ఏఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News December 11, 2024

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు.లబ్ధిదారుల భూముల వివరాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు.