News March 18, 2025
కళ్యాణ తలంబ్రాల పోస్టర్ ఆవిష్కరణ

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలను హోం డెలివరీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ బస్ భవన్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించి తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు.
Similar News
News April 19, 2025
ASF: మల్లక్కను చంపిన శివ అరెస్ట్

భూపాలపల్లి జిల్లా ఆదివారంపేటకు చెందిన వృద్ధురాలి హత్య కేసులో కాగజ్‌నగర్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లక్క(67) కోడలు శ్రీలతకు SKZR మండలం బారేగూడకు చెందిన శివ(42)తో పరిచయమైంది. ఇద్దరు సహజీవనం చేశారు. శివ వేధింపులు తాళలేక ఆమె ఆదివారంపేటకు రాగా శివ కలవాలని చూశాడు. ఆమె నిరాకరించడంతో మల్లక్కను చంపితే కేసు శ్రీలత మీదకే వస్తుందని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు శివను అరెస్టు చేశారు.
News April 19, 2025
MNCL: పోలీసులను ఇబ్బంది పెట్టిన ముగ్గురి అరెస్ట్

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు రవి ఓ లాడ్జి ఎదుట బైక్‌పై ముగ్గురు వ్యక్తులు కూర్చొని న్యూసెన్స్ చేస్తుండగా వెళ్లి అడిగారు. డ్యూటీలో ఉన్నారని తెలిసి పోలీసులను తిట్టిన బానోత్ సాయి వికాస్, సిలారపు వినయ్, ఓ మైనర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News April 19, 2025
ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.