News January 28, 2025

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల MLA

image

జగిత్యాల పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 202 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.19 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

KNR: ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ఎలక్షన్ కమిషన్ నియమావళికి అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన కరదీపిక లోని మార్గదర్శకాలు పాటించాలన్నారు.

News February 13, 2025

NZB: నేషనల్ కబడ్డీ ప్రాబబుల్స్‌లో జిల్లా క్రీడాకారులు

image

జాతీయస్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు ప్రాబబుల్స్ జాబితాకు ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సుశాంక్, శ్రీనాథ్, మహిళల జట్టులో గోదావరి జాతీయ సన్నద్ధ శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. అనంతరం వారి ప్రతిభ నైపుణ్యత ఆధారంగా ఒడిశాలో జరిగే పురుషుల, హర్యాణాలో జరిగే మహిళల సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

News February 13, 2025

MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తుతెలియని రైలు కింద పడి అటకపురం రాజలింగు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నూరు మండలంలోని అక్కెపల్లి గ్రామానికి చెందిన మృతుడు కుమ్మరి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ వెల్లడించారు.

error: Content is protected !!