News July 31, 2024
కవలలకు జన్మనిచ్చి బాలింత మృతి

అల్లూరి జిల్లాలో ఆరు రోజుల బాలింత మృతి చెందింది. ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డుంబ్రిగుడ మండలం గంగుడుకి చెందిన సొయిత శుక్రవారం అరకులోయ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురైంది. అరగంట తర్వాత సిబ్బంది వచ్చి సీపీఆర్ చేయగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మృతి చెందింది. దీంతో ఆసుపత్రి బయట ఆమె బంధువులు ఆందోళన చేస్తున్నారు. కవలలు ఆరోగ్యంతో ఉన్నారు.
Similar News
News December 15, 2025
విశాఖలో పీజీఆర్ఎస్‌కు 299 వినతులు: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 299 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 132 ఉండగా, జీవీఎంసీ 76, పోలీస్ విభాగానికి సంబంధించినవి 24, ఇతర విభాగాలకు చెందినవి 67 ఉన్నాయి.
News December 15, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఇప్పటికే సూచించారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయన్ని గమనించాలని అధికారులు కోరారు.
News December 15, 2025
విశాఖ: పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు స్ఫూర్తి

పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు


