News September 7, 2024
కవిటి ఉద్దాన ప్రాంతంలో మొక్క పెసలతో బొజ్జ గణపయ్య
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బోరువంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది (ముగ్ద గణపతి) పెసర విత్తనాలు వేసి నారుతో తయారుచేసిన విగ్రహాన్ని క్లబ్బుకు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత.
Similar News
News October 9, 2024
శ్రీకాకుళం: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని. ప్రాక్టికల్స్ ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
News October 9, 2024
కొవ్వాడ ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలి
కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ధర్మవరం వద్ద నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులపై, నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ నష్ట పరిహారాలపై చర్చించారు.
News October 9, 2024
శ్రీకాకుళం: ఇసుక లోడింగ్‌కు టెండర్ల ఆహ్వానం
జిల్లాలో మొత్తం 6 రీచ్ల వద్ద ఇసుకను మనుషులతో తవ్వకాలు చేసి నిల్వ కేంద్రానికి తరలించి, వినియోగదారుల వాహనాలకు లోడ్ చేసేందుకు గాను టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా భూగర్భ గనులశాఖ కార్యాలయం (కిమ్స్ ఆసుపత్రి వెనుక)లో ఈ నెల 11న ఉదయం 11 గంటల్లోగా సీల్డు టెండర్ల బిడ్ డాక్యుమెంట్లను స్వీకరించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.